Love at First Sight

నీ జాడే తెలియదులే  నీ ఊసే తెలియదులే ..
కళ్ళముందు నీ హావభావాలు జారిపోవులే …
చూస్తూనే ఉంటాను అది కళ్ళ ముందు నువ్వే అయితే …
వింటూనే ఉంటాను ఆ స్వరమే నీదే అయితే ….
                 అబ్బా !?…
నీ జాడే తెలియదులే  నీ ఊసే తెలియదులే …
కళ్ళముందు నీ హావభావాలు జారిపోవులే …
కాఫీ కప్ కూడా కొంటెచూపుతో కవ్విస్తుందిలే…
మల్లె పూవు మూతి మొత్తుకుంటుందిలే …
రాణిగారేమో బుంగ మూతి పెట్టుకుందిలే …
రాణి!?…. ఆ …… ఎవరు….
మా కుక్క పిల్ల ……………….(నవ్వుతూ…)
నీ జాడే తెలియదులే  నీ ఊసే తెలియదులే …
కళ్ళముందు నీ హావభావాలు జారిపోవులే …
ఎక్కడికైనా వస్తావా అని అడగలనిపిస్తుందిలే …
ఎక్కడికి అంటే !?
సిగ్గుతో పిల్లిమొగ్గలు వేయాలనిపిస్తుందిలే …
కొంటెపనులు ఎన్నో చేయాలనిపిస్తుందిలే అది తలచుకొని అంతలోనే బయపడాలనిపిస్తుందిలే …
చేయని తప్పుకు శిక్ష వేసే నీ అమాయకత్వపు కళ్ళు చూడాలన్పిస్తుందిలే ..
బొబ్బట్లు, పెసరట్లు , చీవాట్లు అడిగి మరి తినాలనిపిస్తుందిలే ……
చీవాట్ల………………!?
చీవాట్లే …………………(పెద్దగా నవ్వుతూ…………)
నీ జాడే తెలియదులే  నీ ఊసే తెలియదులే !….
కళ్ళముందు నీ హావభావాలు జారిపోవులే !…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *