Love Break up -Off beat

అనగనగ ఒక అమ్మాయి అనుకోకుండా ఒక అబ్బాయి
తొలిచూపులో కలిశారు…
మలిచూపులో మాట్లాడారు ..
తొలిప్రేమ అన్నారు ..
చేతిలో చేయి వేశారు, స్కూటర్ పైకి ఎక్కారు ,రయ్యి రయ్యి మన్నారు …
అనగనగ ఒక అమ్మాయి అనుకోకుండా ఒక అబ్బాయి
వైజాగ్ బీచ్ కి వెళ్లారు వాడపావు తిన్నారు
అడుగుల్లో అడుగు వేశారు…
ఇసుక ఫై పేర్లు రాసారు …
మొబైల్ లో ఎన్నో కబుర్లు చెప్పారు ,,,
నిద్రలేని రాత్రులెన్నో గడిపారు….
ఇదేనేమో ప్రేమ అనుకున్నారు….
అనగనగ ఒక అమ్మాయి అనుకోకుండా ఒక అబ్బాయి
చిరుబురు కోపాలతో ఎడా పెడా మొహం పెట్టారు..
చిరాకు తో విసుగెత్తారు…పరాకుతో పరుగెత్తారు ….
చి అంటూ ఇది నువ్వేనా..చ అంటూ ఇది నేనేనా అన్నారు…
గొడవలతో గగ్గోలు పెట్టి ……గోడు పడలేక పోయారు….
తొలిప్రేమ కాస్త తుద ప్రేమ ఆయే ….క్షణ కాలం ఆసక్తి కాస్త కలకాలం విరక్తి అయిపోయే…
ఇదేమి ప్రేమారా రా బాబు అంటూ ,అదేమీ ప్రేమ నే పాపా అంటూ కన్నీళ్ల పర్యంతమయే …అయ్యో…….
అనగనగ ఒక అమ్మాయి అనుకోకుండా ఒక అబ్బాయి
తొలిచూపులో కలిశారు…
మలిచూపులో మాట్లాడారు ..
తొలిప్రేమ అన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *