Love is in Your Thoughts

ఈ  వేళా నా మనసేమో పరుగులు తీస్తుందిలే ..

నా అడుగుల మడుగుల గుర్తులు నీకై వదలాలనిపిస్తుందిలే .

ఆ పైర గాలేమో కుశల ప్రశ్నలు వేసి కవ్విస్తుందిలే .

ఎందుకో తెలియక నా మది తికమకల సుడి లో గింగరాలు తిరుగుతుందిలే ……

ఏదేదో అవుతుందే ……చెలి ఓ  చెలి …చూస్తున్న నిన్ను నా కళ్ళముందు ఈ క్షణమే ..

I see you  now…I see you now………..I see you now…….

 

ఈ  వేళా నా మనసేమో పరుగులు తీస్తుందిలే ..

నా అడుగుల మడుగుల గుర్తులు నీకై వదలాలనిపిస్తుందిలే .

ఆ తింగరి మొహం ఈ బిత్తర చూపులు నాలో అలజడి పెడుతుంటే ….

తెలియని తన్మయతవపు విరహం నాలో ఎదో కొరికే లేపేలా ….

ఏదేదో అవుతుందే ……చెలి ఓ  చెలి …చూస్తున్న నిన్ను నా కళ్ళముందు ఈ క్షణమే ..

I see you  now…I see you now………..I see you now…….

ఈ  వేళా నా మనసేమో పరుగులు తీస్తుందిలే ..

నా అడుగుల మడుగుల గుర్తులు నీకై వదలాలనిపిస్తుందిలే .

నత్త నడక నడవాలనిపిస్తుందిలే కుందేలు తో కబురులు చెప్పాలనిపిస్తుందిలే ..

మేగంతో ముచ్చట పెడుతూ , చిరుగాలి తో స్నేహం చేస్తూ ఆ వర్షపు చినుకై నీ ఒంట్లో జారీ పోవాలనిపిస్తుందిలే …….

ఏదేదో అవుతుందే ……చెలి ఓ  చెలి …చూస్తున్న నిన్ను నా కళ్ళముందు ఈ క్షణమే ..

I see you  now…I see you now………..I see you now…….

 

ఈ  వేళా నా మనసేమో పరుగులు తీస్తుందిలే ..

నా అడుగుల మడుగుల గుర్తులు నీకై వదలాలనిపిస్తుందిలే .

రాత్రేమో ఎగతాళి చేస్తుంటే పగలేమో పాపం అంటుంటే అయినా ఎదో కొంటె జ్ఞాపకం నను మైమరిపించేలే ….

ఏదేదో అవుతుందే ……చెలి ఓ  చెలి …చూస్తున్న నిన్ను నా కళ్ళముందు ఈ క్షణమే ..

ఏదేదో అవుతుందే……చెలి ఓ  చెలి … ఏదేదో అవుతుందే ..

                     ఓ చెలి ……………ఓ చెలి……

    ఇంకా చెప్పాళ్లంటే…………. ఆ…….. ఇంకా….. చెప్పాళ్లంటే??.   (female voice)

నీ గజ్జల సవ్వడి తో నా ప్రతిరోజు తెల్లారిపోతుందిలే ……………….

ఏదేదో అవుతుందే ……చెలి ఓ  చెలి …చూస్తున్న నిన్ను నా కళ్ళముందు ఈ క్షణమే ..

ఏదేదో అవుతుందే ……చెలి ఓ  చెలి …చూస్తున్న నిన్ను నా కళ్ళముందు ఈ క్షణమే ……..

I see you  now…I see you now………..I see you now…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *